శ్రీనిధి రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధి : డీఆర్డీవో పీడీ జగదేవ్ ఆర్యా

శ్రీనిధి రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధి : డీఆర్డీవో పీడీ జగదేవ్ ఆర్యా

దుబ్బాక, వెలుగు : శ్రీనిధి రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీవో పీడీ జగదేవ్ ఆర్యా సూచించారు. శుక్రవారం దుబ్బాక ఐవోసీ కార్యాలయంలో ఐకేపీ సీసీ, వీవోఏలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తీసుకున్న శ్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలను పొందాలన్నారు. పేద మహిళల కోసమే ప్రభుత్వం శ్రీనిధిని ఏర్పాటు చేసిందన్నారు. మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా మహిళలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 

మహిళల ఆర్థికాభివృద్ధికి శ్రీనిధి ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద వ్యాపారాల్లో అడుగు పెట్టాలని చెప్పారు. ఆర్థికాభివృద్ధి కోసం మహిళలు జీవనోపాధిని మెరుగు పర్చుకోవాలని సూచించారు. పొదుపు పాటించిన కుటుంబమే ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని వివరించారు. సమావేశంలో ఏపీడీ సుధీర్, డీపీఎంలు వాసుదేవ్, విద్యాసాగర్, ప్రకాశ్, ఏపీఎంలు కృష్ణారెడ్డి, కిషన్ తదితులు పాల్గొన్నారు.